సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం!
జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి.88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసిపోతుంది.ప్యాకేజీ కోసం రాజీ పడితే ప్రజలు కచ్చితంగా గుణపాటం చెబుతారని విజయసాయి రెడ్డి మండ్డిపడ్డారు. మీరు రోజు జేడీనే..కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ల పార్టీకి,విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు అని చెప్పుకొచ్చారు.
మీరు 2నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి…నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి..ఆ తరువాత 2రోజుల్లోనే జనసేన తరుపున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు!అహా..ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?