ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత, కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ కేసీఆర్ పేరుతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ట్యాగ్ లైన్ తో వివాదాల తేనెతుట్టె కదిపిన వర్మ, తాజాగా ఓపాట పాడి సినిమాను మరింత వివాదాస్పదం చేస్తున్నాడు. ఆంధ్రోళ్ల తాటతీస్తానంటూ కేసీఆర్ అన్నట్టు ఆ పాట సాగుతుంది. కేవలం పబ్లిసిటీకోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వర్మ, ఈసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వర్మకు చీవాట్లు పెడుతున్నారు.
https://twitter.com/RGVzoomin/status/1119485934846787586