ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
