ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటుకు వాడే మాత్ర లొసార్టన్ ప్రమాదకరమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. లొసార్టన్ లో కేన్సర్ కారక రసాయనం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల అమెరికా ఎఫ్.డి.ఎ. వార్నింగ్ మేరకు టొరెంటో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా లొసార్టన్ పొటాషియం, లొసార్టన్ హైడ్రో క్లోరో టియాజెడ్ ట్యాబ్లెట్లను ఉపసంహరించుకుంది. ఈ మాత్రల్లో కేన్సర్ కారక N-మిథైల్ నైట్రో సొగుటిరిక్ యాసిడ్ ఉన్నట్టు గమనించారు. ఎఫ్.డి.ఎ. నిర్దేశిత ప్రమాణాలకంటే లొసార్టన్ ట్యాబ్లెట్లలో ఈ రసాయనం ఎక్కువగా ఉంది. దీనిని దీర్ఘకాలంపాటు వాడటం వల్ల కేన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంది. డాక్టర్లు అధిక రక్తపోటుతో బాధపడే రోగులకు, మరియు నరాల సంబంధమైన బాధపడే టైప్-2 షుగర్ రోగులకు ఈ మాత్రలు వాడతారు. అందువల్ల లొసార్టన్ ట్యాబ్లెట్లు వాడే రోగులు వెంటనే తమ డాక్టర్ ని సంప్రదించాలని అమెరికా ఎఫ్.డి.ఎ. సూచించింది. ఇంతకు ముందే వల్సర్టాన్ అనే ట్యాబ్లెట్లను కూడా అమెరికా ఎఫ్.డి.ఎ. ఉపసంహరించుకుంది. చైనాలోని జిజియాంగ్ కుహాయ్ కంపెనీ తయారు చేసే ఈ మాత్రల్లో కూడా క్యాన్సర్ కారక రసాయనం ఉందని హెచ్చరించింది.
