నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో జోరు చూపించాడు. కానీ కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో అలీ విధ్వంసం సృష్టిస్తూ 4,6,4,6,6తో 27 పరుగులు సాధించి అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు.చివరకు కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు.
భారీ లక్ష్యం కళ్లముందున్నా కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలో దారుణంగా తడబడింది. కానీ తర్వాత గ్రీజులోకి వచ్చిన రాణా, రస్సెల్ జట్టు విజయంపై ఆశలు రేపింది.రస్సెల్ బరిలోకి దిగే సమయానికి విజయం కోసం 48 బంతుల్లో 131 పరుగులు కావాల్సి ఉంది. ఆరంభంలో రస్సెల్‌ను కొంచెం ఇబ్బంది పడినా చాహల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో అతడు హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇతడికి జతగా రాణా మరుసటి ఓవర్‌లో రెండు సిక్సర్లు సంధించి 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.17వ ఓవర్‌లో రస్సెల్ 4,6 బాదగా 18వ ఓవర్‌లో రాణా 6,6,4తో హోరెత్తించాడు. 19వ ఓవర్‌లో రస్సెల్ మూడు సిక్సర్లతో బెంగళూరులో టెన్షన్ పెంచాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ.. బంతి మొయిన్ అలీ చేతికిచ్చాడు.చివరి ఓవర్ లో రస్సెల్ అవుట్ కావడంతో మ్యాచ్ బెంగళూరు గెలిచింది.