యావత్‌దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక అంకం సజావుగా, విజయవంతంగా కొనసాగుతున్నది. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నందిమేడారం సర్జ్‌పూల్‌కు చేరుతుండటంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని భారీ మోటర్లకు ఈ నెల 24న వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడ్రోజుల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలచేసిన గోదావరి జలాలు.. 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, సుమారు 9.54 కిలోమీటర్ల చొప్పున ఉన్న జంట సొరంగాలను దాటి నందిమేడారం సర్జ్‌పూల్‌లోకి చేరుతున్నాయి. ఈ మార్గంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేకుండా జలాలు సాఫీగా సాగిపోయాయని నిర్ధారించుకున్న అధికారులు.. సర్జ్‌పూల్‌ను నింపడంలో నిమగ్నమయ్యారు.
సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, కాళేశ్వరం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్, ఇతర ఇంజినీర్లు సర్జ్‌పూల్ నిండే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నందిమేడారం సర్జ్‌పూల్ 25 మీటర్ల వెడల్పుతో, 67.5 మీటర్ల లోతుతో ఉంటుంది. సర్జ్‌పూల్‌లో దిగువన సొరంగాలు కలిసే ప్రాంతం ఎఫ్‌ఆర్‌ఎల్ 109 మీటర్లుగా ఉన్నది. అంటే సముద్రమట్టానికి 109 మీటర్ల ఎత్తులో సొరంగాలు కలిసే ప్రాంతం ఉన్నదన్నమాట. సొరంగాల ద్వారా అందులోకి జలాలు వస్తుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ఇప్పటివరకు సర్జ్‌పూల్‌లో నీటిమట్టం 124.5 మీటర్ల వరకు వచ్చినట్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. అంటే 109 మీటర్ల నుంచి దాదాపు 16 మీటర్ల మేర నీళ్లు నిండాయి.
ఇలా 133 మీటర్ల వరకు నీటిమట్టం చేరితే నందిమేడారం పంపుహౌజ్‌లోని మోటర్ల వెట్న్‌క్రు మార్గం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఇంజినీర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతి గంటకు 0.6 మీటర్ల మేర నీటిమట్టం పెరుగుతున్న దరిమిలా 133 మీటర్లకు నీటిమట్టం చేరిన తర్వాత అధికారులు మోటర్లకు వెట్న్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు సర్జ్‌పూల్‌లో నీటిమట్టం పెరుగుతుండగా.. ఎక్కడా ఒక్క లీకేజీ కూడా లేకపోవడంపై అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న పంపుహౌజ్‌లోని 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్ల వెట్న్ మొదలుపెట్టాలని తాజాగా నిర్ణయించారు. ఇప్పటికి నాలుగు మోటర్లు వెట్న్‌క్రు సిద్ధంగా ఉన్న దరిమిలా ఒక్కొక్కదానికి 20-30 నిమిషాలపాటు వెట్న్ (నీటిని లిఫ్టు చేయడం) చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు.
ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర ఇంజినీర్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణాలను మహారాష్ట్ర ఇంజినీర్లు శుక్రవారం పరిశీలించారు. వారికి కాళేశ్వరం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు పలు ప్రాంతాల్లోని నిర్మాణాలను చూపి, సాంకేతిక వివరాలను తెలియజేశారు. మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బరాజ్‌ను పరిశీలించిన ఇంజినీర్లు.. వెట్న్ కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా చూశారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా నీటి విడుదల, నంది మేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌ను నింపే ప్రక్రియను పరిశీలించారు. ఈ బృందంలో మహారాష్ట్ర జల వనరులశాఖ చీఫ్ ఇంజినీర్లు ఏఆర్ కంబ్లే, బెల్సేర్, ఎనిమిదిమంది సూపరింటెండెంట్ ఇంజినీర్లు, పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు ఉన్నారు.