తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడుత నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. రెండో విడుతలో భాగంగా 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30న మూడో విడుత నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడో విడుతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్ జరగనుంది.
