తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే హీరోయిన్‌ను అయ్యాను. ఏడాదిగా నేను అనుభవించిన బాధకు నేడు ఫలితం దక్కింది. ఆ రోజు నేను చేసిన అర్ధ నగ్న ప్రదర్శనకు ఫలితమే ఇది. నేను చేసిన ఈ ఉద్యమంలో నాకు వెన్నంటి ఉండి సాయపడిన సంధ్య, వసుధ, సజయ, తేజ్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అపూర్వకు చాలా థ్యాంక్స్’’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
Being a Hyderabadi Proud moment today..Thank u soooooooo much real hero kcr garu..my dream came true today..from mark of…
Posted by Sri Reddy on Wednesday, 17 April 2019