ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించింది.