విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ నిండు గర్భిణీని అత్త కాలితో తన్నింది. మణికట్టుపై భర్త బ్లేడుతో కోశాడు. ఎలాగైతోనో స్థానికుల సాయంతో బాధితురాలు తప్పించుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు కెజిహెచ్ లో చికిత్స జరుగుతోంది.అక్కడ స్థానికులు ఆ తల్లీ కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
