ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు సమాధానం చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.. మంత్రి సహకారంతోనే దాడులు జరుగుతున్నాయనా అని ప్రశ్నించారు..తిరుమలనాయుడు పై దాడి చేసిన వారు వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ తానెప్పుడూ దాడులను ప్రోత్సహించ లేదన్నారు..
తిరుమలనాయడు అధికారం ఉంది కదా అని అనేక పాఠశాలల పై దాడులు చేశారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు..వెంకటాచలం మండలంలో పోలింగ్ తరువాత వైసీపీ కార్యకర్తలు పై దాడులు జరిగాయని, అందులో మీ హస్తం ఉందా అంటూ మంత్రి సోమిరెడ్డిని ఆయన ప్రశ్నించారు..కావలి లో జరుగుతున్న అనేక దాడుల వెనుక బీద రవిచంద్ర హస్తం ఉందా అంటూ ఆయన సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
