నితిన్ ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు.హీరోగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి.ఇందులో ముందుగా ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించాలని బావిస్తున్నారు. ‘ఛలో’ సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.ఇది కూడా ప్రేమకథా చిత్రమే..ఇందులో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.అయితే కొన్నిరోజులుగా ఈ చిత్రంలో మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారనే వార్త వినిపిస్తుంది.అయితే దీనిపై స్పందించిన వెంకీ కుడుముల ఇందులో ఒకరే కథానాయిక అని ఆ పాత్రకి రష్మికను తీసుకున్నామని చెప్పాడు.త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామనే విషయాన్ని తెలియజేశాడు.
