ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ప్రజలు తీర్పుచెప్పారు. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమే. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టి ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో..
ఫస్ట్ ఫేజ్లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ స్థానాలకు, అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అంతటా ఈవీఎంలలో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. అయినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. బాబు మాత్రం దేశమంతా తిరుగుతూ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపాలని బట్టలు చింపుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 17, 2019
కోడెల ఇనుమెట్ల పోలింగ్ బూత్ ఆక్రమణ ఘటనపై ప్రజలను రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేసిన కుల మీడియాపై ఎలక్షన్ కమిషన్ కేసులు నమోదు చేయాలి. సొమ్మసిల్లినట్టు పడిపోయి, చొక్కాచించుకుని నాటకమాడినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మీడియాలో మాత్రం కోడెలపై దాడి జరిగినట్టు దుష్రచారం చేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 17, 2019