టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుటివారికి సాయం చేయడంలో ముందే ఉంటారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చిన్న పిల్లలనుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో వేళ మందికి సాయమందించారు. ఈ క్రమంలోనే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన ధర్మతేజ ( రెండేండ్ల బాలుడు ) కి ప్రాణదానం చేశారు. పేద కుటుంబంపై పైసా భారం పడకుం డా రూ.2.70 లక్షలకుపైగా వెచ్చించి చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించారు.గత కొన్ని రోజులక్రితం అనారోగ్యంబారిన పడిన ధర్మతేజను కరీంనగర్ లోని ఒక దవాఖానలో చూపించగా, గుండెకు రంధ్రం ఉన్నదని, ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే గతనెల 25న సిరిసిల్లలో ఎన్నికల ప్రచారసభకు వచ్చిన కేటీఆర్‌ను.. ధర్మతేజ, తల్లిదండ్రులు కలిసి వారి కష్టాన్ని విన్నవించారు. వారి కష్టాన్ని చూసి చలించిన కేటీఆర్.. హైదరాబాద్‌లో బాలుడికి ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 10న హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు. 15న చిన్నారికి చేసి న గుండె ఆపరేషన్ విజయవంతమైందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. దవాఖానలో చిన్నారి ధర్మతేజ చిరునవ్వుతో ఉండ గా, తల్లిదండ్రుల కండ్లలో ఆనందం వెల్లివిరిసిం ది. కేటీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు చెప్తున్నారు.
