జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు అవసరమైన నిధులను బ్యాంకులు విడుదల చేయకపోవడంతో తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు ఎయిర్‌వేస్ పేర్కొన్నారు.మొన్నటివరకు 123 విమానాలతో జెట్ ఎయిర్‌వేస్ సేవలందించిన విషయం అందరికి తెలిసిందే.కాని మొన్న సోమవారం నాటికి ఆ సంఖ్య 5కు పడిపోయింది.ఈరోజు అయితే మొత్తానికి ఈ సంస్థ సేవలు పూర్తిగా ఆగిపోతాయి అనడానికి సందేహం లేదు.ఒక్క పక్క డబ్బులు ఇస్తేనే ఇంధనం (ఏటీఎఫ్) సరఫరా చేస్తామని ఆయా సంస్థలూ అడ్డంతిరగడంతో పరిస్థితి ఇంకా విషమంగా మారింది.మరోపక్క ఎగ్జిమ్‌బ్యాంక్ ఇచ్చిన రుణాలతో కొనుగోలు చేసిన విమానాలను ఆ బ్యాంకు వారు స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇవ్వన్ని ఇలా ఉండగా అందులో పనిచేసే సిబ్బంది మూడున్నర నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా యాజమాన్యం మారితేనైన వాళ్ళకి గడ్డుకాలం పోతుందని భావిస్తున్నారు.జెట్ ఎయిర్‌వేస్ నిలిచిపోవడంతో మిగతా విమానాల్లో ఛార్జీల పెరుగుదలను రోజువారీగా పరిశీలించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ప్రభు ప్రకటించారు.