మరో ప్రమాదం..షూటింగ్ నుండి వస్తుండగా ఇద్దరు బుల్లితెర నటులు.. మృతిచెందారు.మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరి ప్రాణాల్ని తీసుకుంది.అయితే అసలు విషయానికి వస్తే ఓ సీరియల్‌లో నటిస్తున్నారు భార్గవి (20), అనుషారెడ్డి (21) షూటింగ్ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్ళడం జరిగింది. షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్టిస్టులు అక్కడికక్కడే మరణించారు.అయితే ఇందులో వీరీతో పాటు మరో ఇద్దరు ఉన్నారు.డ్రైవర్ మరియు వినయ్ కుమార్.వీరిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వీళ్ళని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.మోయినాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్ చేసుకొని దర్యాప్తు చేపట్టారు.