తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తమకు ఈ సమస్య ఉందని చిన్న ట్వీట్ చేసిన చాలు క్షణంలోనే రియాక్ట్ అయ్యి వెంటనే తన కార్యాలయంలోని టీమ్ ను అప్రమత్తం చేస్తారు.
తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్లో కేటీరామారావు ను ట్యాగ్ చేస్తూ”ఆంధ్రా అయిన తెలంగాణ అయిన ప్రాంత భేదాలు చూడకుండా హెల్ప్ చేసేది మీరే సారు. కష్టం అంటే చాలు అరక్షణంలో స్పందిస్తారు. అందుకే సారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యువతికి హెల్ప్ చేయండి . ఆంధ్రప్రాంత నాయకులను ట్యాగ్ చేసిన స్పందించలేదు. వాళ్లు వేస్ట్ సారు.
మీరోక్కరే హెల్ప్ చేయగలరు”అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీటుకు స్పందించిన కేటీ రామారావు “ఈ యువతి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం చేయలేకపోయిన నా సొంత ఖర్చులతో సాయం చేస్తాను. నాకు ఫుల్ డీటైయిల్స్ పంపు”అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ అసుపత్రి సీఈఓతో మాట్లాడి కేటీ రామారావు వైద్యానికి అయిన ఖర్చును తగ్గించమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ “ఆపద అని తెలిస్తే చాలు అరనిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే సాయం చేసే గొప్ప మనసున్న మారాజు కేటీఆర్.. రామారావు నువ్వు గ్రేటయ్యా.. “అంటూ పొగడ్తలతో,ట్వీట్లతో కేటీ రామారావును ప్రశంసిస్తున్నారు..