వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రతినిధుల బృందం గవర్నర్ తో భేటీ కానుంది. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన పరిస్థితులను జగన్ నరసింహన్ కు వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, టీడీపీ వర్గీయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య ప్రజలపై దాడులకు దిగుతున్నారని, దీనిపై వెంటనే చర్యలకు తీసుకోవాలని గవర్నర్ ను జగన్ కోరనున్నారు.