ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ నేతల దాడుల గురించి సవివరంగా గవర్నర్ కు వివరించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ” ఎన్నికల సందర్భంగా వాడిన ఈవీఎంల గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మీడియా కూడా ప్రశ్నించాలని ఆయన కోరారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ”రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఓటు వేశాక వీవీ ప్యాట్ లో తను ఏ పార్టీకి ఓటు వేశాడో ఆ పార్టీ గుర్తు కనిపించిన తర్వాతనే అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇదే విధంగా మొత్తం పోలింగ్ నమోదైన 80శాతం మంది ఓట్లు వేశారు.వారికి ఎవరికి ఎటువంటి సందేహం రాలేదు.వారంతా సంతృఫ్తి చెందారు కాబట్టే ఎవరూ దీనిపై పిర్యాదు చేయలేదని అన్నారు . కానీ నారా చంద్రబాబు నాయుడు మాత్రం డ్రామాలు ఆడుతూ తన ఓటు తనకు పడిందా అని అడగడం దర్మమా అని ఆయన ప్రశ్నించారు. నేను ఓటు వేశాక వీవీ ప్యాట్ లో తేడా వస్తే తాను ఎందుకు ఊరుకుంటాడు ఆయన రాజ్ భవన్ సాక్షిగా బాబును ప్రశ్నించి షాకిచ్చారు.
చిన్నపిల్లాడి మాదిరిగా తను మాట్లాడిందే నిజం అని తన డబ్బా ఛానెళ్ల ద్వారా ప్రసారం చేయడం ఎంతవరకు సబబో ఆయన ఆలోచించుకోవాలి అని సూచించారు. ఒకపక్క నూట యాబై సీట్లు వస్తాయని చెప్పుకుంటూ మరోవైపు ఈవీఎంలపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇకనైనా సరే డ్రామాలు కట్టిపెట్టాలని … అన్ని బూత్ లలో పార్టీల ఏజెంట్లు ఉంటారు. మాక్ పోలింగ్ తర్వాత సంతకాలు చేస్తారు. ఆ తర్వాతనే ఈవీఎంలు బాగానే ఉన్నాయని నిర్దారిస్తారు. ఆ తర్వాతే పోలింగ్ జరుగుతుంది. అప్పుడు టీడీపీ ఏజెంట్లు కూడా ఉంటారని, అన్ని తనిఖీలు చేసిన తర్వాత సంతకాలు పెట్టారని ఆయన అన్నారు.అయినా చంద్రబాబు ఏ రకంగా ఈవీఎంలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేయడం తగిన పనేనా అని జగన్ ప్రశ్నించారు.