అబుదాబి లో మార్చి14 నుండి 21 వరకు జరిగిన స్పెషల్ ఓలంపిక్స్ ప్రపంచ సమ్మర్ గేమ్స్ లో తెలంగాణ కు చెందిన యువ క్రీడాకారుడు అద్వైత్ స్విమ్మింగ్ లో బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం లో నిలిచి రజత పతకం సాదించినందుకు రాష్ట్ర అబ్కారి, పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అద్వైత్ ను అభినందించారు. సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలసిన అద్వైత్, తను సాదించిన పతకాన్ని మంత్రి కి వివరించాడు. ఈ కార్యక్రమములో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, అంథోల్ శాసన సభ్యులు క్రాంతి కిరణ్, T N G O అసోసియేషన్ అద్యక్షులు రవిందర్ రెడ్డి లు పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ఫడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో తెలంగాణ క్రీడాకారులు మంచి ఫలితాలు సాదిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
