మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్ఐసీ ఏజెంట్ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళపై దాడి చేసారు.ఆడవారని కూడా చూడకుండా జత్తుపట్టుకొని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు.ఈ ఘటన కుందువానిపేటలో శుక్రవారం జరిగింది. నీలవేణి తన పిల్లలను స్కూల్కు పంపే పనిలో ఉన్నప్పుడు అటుగా వచ్చిన టీడీపీ మాజీ సర్పంచ్ సూరడ అప్పన్న ఆమెను దూషించాడు.
అంతేకాకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఈమె జుత్తు పట్టుకుంటూ బయటకు ఈడ్చుకు వచ్చాడు. తన కుమారులతో కలసి ఈ దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.విషయం తెలుసుకున్న తన భర్త అక్కడికి రాగా అతనితోను వాగ్వాదానికి దిగారు. అతడిపై కూడా దూషించి కొట్టారు. ఇదేక్రమంలో బాధితులకు గ్రామస్తులంతా మద్దతుగా నిలవడంతో వారు అక్కడ్నుంచి జారుకున్నారు.బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి నేరుగా వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకున్నారు.