ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్‌షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ సం క్షేమ సంఘాలు తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్‌షో అని ప్రకటించిన నాయకులు..ఆ త ర్వాత 3:30 గంటలకు వాయిదావేసుకొన్నారు. టైం గడిచినా జనాల జాడలేకపోవడంతో బైకులు, కార్లతో మన్సూరాబాద్ చౌరస్తాను జామ్చేసేందుకు ప్రయత్నించారు. చివరకు రోడ్‌షో రద్దుచేసినట్టు ప్రకటించారు.