నటుడు శివాజీ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అవినీతి ఉందన్న శివాజీకి చంద్రబాబు మరిప్పుడెలా దేవుడయ్యారు? చంద్రబాబు ఎలాంటి వ్యక్తో.. జగన్ ఎలాంటి వ్యక్తో చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు.
జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటను ఏనాడూ జగన్మోహన్రెడ్డి తప్పలేదు. హోదాపై అనేకసార్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే జగన్మోహన్రెడ్డి పోరాడారు. జగన్ మంచివాడు కాదని పవన్ నిరూపిస్తే.. నేను పవన్ కల్యాణ్‌ని సమర్థిస్తా. అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించకుండా పవన్ జగన్‌ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్‌పై కేసులు పెట్టించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మకండి. చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ.. అని పోసాని ధ్వజమెత్తారు.