ఆంద్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా అనేక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నారాయణ నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి ఉన్నాడా..? అవును నిజమే అనిపిస్తుంది ఈ మధ్య స్థానికంగా పత్రికలో నారాయణ తోడల్లుడు రామ్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా ఆయన వెలువరించడం జరిగింది…మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు వెనుక పట్టాభి హస్తం ఉందని దీనిపై పూర్తి విచారణ జరిపించాలని. పట్టాభి మరియు ఒక పెద్ద వ్యక్తి విద్యార్థినులను హింసించి మానసికంగా వేధించి దాని వల్ల విద్యార్థులు చాలామంది మెడికల్ కాలేజీలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన స్థానికంగా ఉన్నటువంటి పత్రికకు ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది…ఇవన్నీ చూస్తుంటే అసలు నారాయణ కళాశాల ఏం జరుగుతుంది అనే సందేహం ప్రజల్లో రేకెత్తిస్తుంది…నాణ్యమైన విద్యను అందించాల్సిన కళాశాలలు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటే ఏమనుకోవాలి..లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుంటూ ఇలా విద్యార్థిని విద్యార్థులకు హింసించి వేధించి ఆత్మహత్యల చేసుకునేలా వేదిస్తున్నారని ప్రతిపక్షాలు తెలుపుతున్నాయి.
