టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దుర్భాషలాడారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అబ్బయ్యచౌదరిపైకి చింతమనేని దూసుకొచ్చారు. పోలీసులు చింతమనేనికి కొమ్ము కాస్తూ గొడవను సద్దుమణిగేలా చేసారు. అయితే తన ఓటమికి తానే బాధ్యుడని తన విధానాల వల్లే చింతమనేని ఘోర పరాజయం పాలవుతున్నాడని అబ్బయ్యచౌదరి విమర్శించారు. చింతమనేని గూండా అని విమర్శించారు. అయితే చింతమనేని వ్యవహారశైలి వల్ల ప్రతీ ఒక్కరూ ఆయనను తప్పుబడుతున్నారు.