ఒకప్పుడు జర్నలిజం రాతిపలకలపై, జంతు చర్మాలపై ఉండేదని చరిత్ర చెప్తుంది. తర్వాత ప్రింట్ మీడియా ఆవిర్భావం తర్వాత జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. అనంతరం టీవీ మీడియా ద్వారా ప్రతీ ఇంట్లోకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ వ్యక్తి చేతుల్లోకి మీడియా వచ్చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ వెబ్ సైట్లు ఆవిర్భవించాయి. వాటిలో దరువు కూడా ఒక్కటి.అయితే దరువు ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.. ఏనాడూ సామాజిక బాధ్యతను విస్మరించలేదు. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి చేసినపుడు అభినందిస్తూనే ప్రతిపక్ష పార్టీల బాధ్యతను గుర్తు చేస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో విశ్వసనీయతతో వేగవంతంగా పనిచేసింది.
రాజకీయాలు, సినిమాలు, బిజినెస్, లైఫ్ స్టైల్, జాతీయ, అంతర్జాతీయ సమాచారాల్ని వేగంగా బ్రౌజర్ల ముందు ఉంచుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది వెబ్ సైట్లు ఉండగా పోటీని తట్టుకుని దరువు నిలబడుతోంది. ఆలిండియా ర్యాంకు, గ్లోబల్ ర్యాంకింగ్ లో కూడా దరువుకు మంచి స్థానాలు వచ్చాయి. దరువు ఇచ్చిన సర్వే రిపోర్టులు, దరువు చెప్పిన సమాచారం ఇప్పటివరకూ కచ్చితంగా వాస్తవాలయ్యాయి. ఈ క్రమంలో ప్రతిరోజు దరువు సైట్ వీక్షించేవారి సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. దరువు ఫేస్ బుక్ వ్యూస్ ఇప్పటివరకూ 25కోట్లకు, వైబ్ సైట్ వ్యూస్ 10కోట్లకు, యూట్యూబ్ వ్యూస్ 14కోట్లకు పైగా చేరుకున్నాయి. దరువు ఫేస్ బుక్ పేజ్ రీచ్ ప్రతీరోజూ కోటికి చేరుకుంటోంది. ప్రతిరోజూ కొత్త అంశాలను వార్తలు, విశ్లేషణల రూపంలో అందిస్తూ ప్రజాదరణ చూరగొనేందుకు దరువు ప్రయత్నిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనే కాక ఇతర దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అమెరికా, కువైట్, మస్కట్, దుబాయ్ వంటి దేశాలనుంచి కూడా దరువుకు పాఠకులు, అభిమానులు ఉన్నారని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఇంతగా “దరువు.కామ్”ని ఆదరిస్తోన్న నెటిజన్లకు, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న కోట్లాదిమంది మిత్రులకు దరువు యాజమాన్యం మరియు సిబ్బంది తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Home / ANDHRAPRADESH / కోట్లమందికి చేరువైన దరువు.. డిజిటల్ మీడియా రంగంలో అనతికాలంలోనే అగ్రస్థానంలోకి
Tags ALL SOCIAL MEDIAS channel dharuvu facebook dharuvu website top youtube