Home / 18+ / వినుకొండలో బలంగా వీస్తున్న ఫ్యానుగాలి.. బ్రహ్మన్నకు బ్రహ్మరధం.. టీడీపీకి డిపాజిట్లు గల్లంతే

వినుకొండలో బలంగా వీస్తున్న ఫ్యానుగాలి.. బ్రహ్మన్నకు బ్రహ్మరధం.. టీడీపీకి డిపాజిట్లు గల్లంతే

అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం.. అప్పుడే అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచింది.. ఆ స్థలమే విన్నకొండ.. కాలక్రమంలో వినుకొండగా మారింది. ఇక్కడినుంచి అనేకమంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు వచ్చారు. వినుకొండ నియోజకవర్గం అటు పల్నాడుకి దగ్గరగా బెజవాడకు దూరంగా ఉన్న ప్రాంతం. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన జిల్లా కావడంతో ఎప్పుడూ రాజకీయం ఒకరి వైపే నిలవలేదు. ఒక్కోసారి ఒక్కో పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తోంది. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్ధికి అవకాశం ఇచ్చే సెంటిమెంట్ ఉంది.. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే 1962లో నియోజకవర్గం ఏర్పడి తొలిసారి ఎన్నికల్లో నిలవడంతో కాంగ్రెస్ అభ్యర్ధిపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విజయం సాధించారు, అయితే వెంటనే 1967లో గతంలో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం సాధించారు. 1972లో మరోసారి ఆమె విజయం సాధించడంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1978లో, 72లో ఓడిపోయిన నాయకుణ్ణే ప్రజలు సానుభూతితో గెలిపించుకున్నారు.

ఆ క్రమంలోనే 1983లో ఎన్నికలు జరగగా 78లో ఓటమి పాలైన నాయకుణ్ణే ఎన్నుకున్నారు. అలా ఓడిపోయినవారిని గెలిపించుకుంటూ గెలిచినవారిని ఓడిస్తూ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారిక్కడ.. తాజా ఎన్నికలు తీసుకుంటే 2004లో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల లీలావతి ఓటమి చెందడంతో ఆ సెంటిమెంట్ 2009, 2014లో ఆమె భర్త జీవీ ఆంజనేయులు గెలిచారు. ఈ లెక్కన చూసుకుంటే 2019లెక్కలో సానుభూతి సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం గత ఎన్నికల్లో ఓటమిపాలైన నాయకుడికే పట్టం కట్టాలి.. సామాన్య రాజకీయ చరిత్ర ఉన్న వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వైద్యవృత్తిలో ఉన్న వీరపనేని యల్లమందరావు కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. స్థానికేతర అభ్యర్థులైన భవనం జయప్రద, నన్నపనేని రాజకుమారిలను కూడా గెలిపించి గౌరవించారు.

నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటి, వినుకొండ, శావల్యాపురం, బొల్లాపల్లి, ఈపూరు, నూజండ్ల మండలాలు ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే గత కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అన్నీ కమ్మ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తున్నాయి. ఇక్కడనుంచి కొన్నేళ్లుగా ఆ వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఇటీవల వరసగా సీట్లు మార్చుకుంటూ వస్తున్న వైసీపీ అధినేత జగన్‌ నరసారావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఏడు జనరల్‌ స్థానాల్లోనూ ఒక్క వినుకొండలో మాత్రమే కమ్మ వర్గానికి చెందిన బొల్లా బ్రహ్మనాయుడును దింపారు. ఇక్కడ దశాబ్దన్నర కాలంగా టీడీపీలో పనిచేస్తున్న జీవీ ఆంజనేయులు 2009, 2014లో విజయం సాధించారు. మండలాల వారి బలబలాలు చూస్తే ఈపూరు, నూజండ్ల లో వైసీపీ టీడీపీ బలాబలాలు సమానంగా ఉండగా.. శావల్యాపురం మండలంలోని వేల్పూరు బ్రహ్మనాయుడు స్వగ్రామం కావడంతో ఈ మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో బ్రహ్మనాయుడికి బ్రహ్మరధం పడుతున్నారు.

వినుకొండ రూరల్‌ల్లోనూ వైసీపీనే ఆధిక్యం కనబరుస్తోంది. వినుకొండ మున్సిపాలిటీలో కూడా టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నాడు బ్రహ్మనాయుడు.. ముఖ్యంగా జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోవడంతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో పార్టీలకతీతంగా ప్రతీఒక్కరూ బ్రహ్మనాయుడిని ప్రశంశిస్తున్నారు. ఎన్నో కిలోమీటర్ల నుంచి వినుకొండలో నీటిని తీసుకెళ్తున్నారు. బ్రహ్మనాయుడు మాత్రం వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తున్నారు. ఎన్నో గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

విస్తృత‌ సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు తన ట్రస్టు ద్వారా కూడా నిరంతరం చేస్తున్న సేవలతో నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా బ్రహ్మన్నను తిరుగులేని రాజకీయ నాయకుడిగా అందరూ చూస్తున్నారు. నియోజకవర్గంలో పెన్షన్లు, ఇళ్లు, సిమెంట్‌ రోడ్లు కావాల్సిన ప్రాంతాల్లో ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చూస్తే జిల్లాల్లో మరోసారి వినుకొండలో వైసీపీ అభ్యర్ధి భారీ మెజారిటీతో గెలుస్తారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత, పధకాలపై అసంతృప్తి, జీవీ ఆంజనేయులు వర్గాలను ప్రోత్సహించడం, హత్యా రాజకీయాలు చేస్తారనే ఆరోపణలకు తోడు బ్రహ్మన్న యువతకు ఉపాధి కల్పించడంతో సఫలమవడం, త్రాగునీరు సొంత ధనంతో ప్రజలకు అందివ్వడం బ్రహ్మన్నకు కలిసొస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat