ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గరగా ఉండండతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పోసాని, ఆలీ, హీరో తనీష్ ఇలా చాలమంది జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ నివాసంలో ఆయనను కలిశారు. పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎన్నికలకు ఇంకా 10 రోజులు ఉండండతో మరింత మంది సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీలోకి చేరుతున్నట్లు తెలుస్తుంది.
