Home / 18+ / ఉక్కునగరంలో సత్తా చాటేదెవరు.? జోన్ క్రెడిట్ ఎవరికి.? గిరిజనుల ఓట్లు ఎవరివైపు.? భూకబ్జాలు కబళిస్తాయా.? దరువు గ్రౌండ్ రిపోర్ట్..

ఉక్కునగరంలో సత్తా చాటేదెవరు.? జోన్ క్రెడిట్ ఎవరికి.? గిరిజనుల ఓట్లు ఎవరివైపు.? భూకబ్జాలు కబళిస్తాయా.? దరువు గ్రౌండ్ రిపోర్ట్..

విశాఖపట్నం.. హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ హోదా పొందిన నగరం.. సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ జిల్లా.. అలాంటి జిల్లా ఇప్పుడు తాజా రాజకీయాలతో వేడెక్కుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలోనే అతి పెద్ద నగరమైన విశాఖ పార్లమెంట్ స్థానానాలతో పాటు జిల్లాలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సుబ్బరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి వంటి నేతలన ఇక్కడ ఆదరించారు. 2014లో అనేక కారణాలతో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ సీఎం, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మిని ప్రజలు తిరస్కరించారు. స్థానికత అంశమే విజయమ్మ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున విశాఖలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఎంవీవీఎస్ మూర్తి మనవడు, హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ జనసేన తరపున జేడీ లక్ష్మీ నారాయణ బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోరు కనిపించే అవకాశం ఉంది. కానీ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ఇక్కడి నియోజకవర్గాలను పరిశీలిస్తే..

పెందుర్తి..
జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. ఇక్కడినుంచి పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్ధులను పరిశీలిస్తే.. టీడీపీ అభ్యర్ధి బండారు సత్యనారాయణమూర్తిని చూస్తే ఆయనతో పాటు ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడిపై ఉన్న అవినీతి ఆరోపణలు ఇన్ని అన్ని కాదు.. రాష్ట్రంలోని అవినీతి ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానంలో బండారు ఉన్నారు.. నియోజకవర్గంలో బండారు చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావట.. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారనే విపరీతమైన వ్యతిరేకత ఉంది.. జనసేననుంచి పోటీ చేస్తున్న చింతలపూడి వెంకట్రామయ్య గతంలో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీ తరుపున గెలిచారు.. అయితే ఈయన నాన్ లోకల్ అవడంతోపాటు గతంలో గాజువాకలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం.. గత నాలుగేళ్లుగా పెందుర్తి నియోజకవర్గంలో ఏ కార్యక్రమాల్లోనూ ఇతను పాల్గొన్న సందర్భాలు లేవు. పెందుర్తిలో విద్యావంతులు ఎక్కువ. పవన్ ను అభిమానించే 100 మందిలో 60 మందికి పైగా వైసీపీ అభ్యర్థి వెంట నడుస్తున్నారు..

అన్నంరెడ్డి అదీప్ రాజ్ గురించి చూస్తే 2006లో రాజకీయ ప్రవేశం చేశారు అప్పటి నుండి ఎంతోమందికి తన సొంత నిధులతో సుమారు 80 గృహాలు నిర్మించారట.. గొరపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల కోసం సొంత భూమిని కూడా విరాళంగా ఇచ్చారని దాని విలువ సుమారు కోటి రూపాయలు పైనే ఉంటుందని చెప్తున్నారు. 108 సర్వీసెస్ సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి వాటికి బహుమానంగా ఇచ్చారట.. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు తన సొంత నిధులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు.. సుమారు 150 మందికి పైగా సొంత నిధులతో పెన్షన్ రాలేని వృద్ధులకు వికలాంగులకు తానే స్వయంగా పెన్షన్లు ప్రతినెల ఇస్తున్నారు.. అవినీతికి దూరంగా ఉంటూ వ్యాపారాల్లో సంపాదించిన సొంత డబ్బును ప్రజాసేవకోసం ఎన్నో రకాలుగా అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుస్తోంది. మంచివ్యక్తి, సేవా దృక్పథం ఉండడంతోపాటు సౌమ్యుడైన అదీప్ రాజుకు పెందుర్తి ప్రజలు జై కొడుతున్నారు. అదీప్ రాజ్ గారికు ఒక్క అవకాశం ఇస్తే మంచి చేస్తాడనే నమ్మకంతో పెందుర్తి ప్రజలు ఉన్నట్టు సమాచారం

భీమిలి..
భీమిలి నియోజకవర్గంలో నారా లోకేష్‌ ను పోటీ చేయించాలనుకున్నా టీడీపీ వెనక్కు తగ్గిందంటే కారణం.. అక్కడి వైసీపీ అభ్యర్ధి అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌.. దానికి కారణం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే మనం కూడా రాజీనామా చేద్దామని అంటే చంద్రబాబు వద్దన్నారని అవంతి మనస్థాపానికి గురయ్యారు. రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ కలవడాన్ని అవంతి తప్పుబట్టారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయంతో ధ్వజమెత్తారు అవంతి. అలాగే ఓ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రధాని కార్యాలయానికి సమాచారం అందిందని, దానిపై ప్రధాని సీరియస్ అయ్యారని తెలిపారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. అయితే అధికారంలో ఉన్న పార్టీనుంచి చంద్రబాబు విధానాలను తప్పుబడుతూ వైసీపీలో చేరడం పట్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అవంతికి ఉన్న ఇమేజ్ వైసీపీకి కలిసొస్తుండగా.. టీడీపీ అభ్యర్ధిగా సబ్బం హరిని బరిలోకి దింపుతున్నారు. అయితే సబ్బంకు ఇష్టం లేకుండా ఇక్కడ బలవంతంగా పోటీ చేయిస్తున్నారని, పదేళ్లుగా అడ్రస్ లేకుండా పోయిన సబ్బం హఠాత్తుగా ఇక్కడికి వస్తే ఎలా నమ్ముతామంటూ భీమిలిప్రజలు ప్రశ్నిస్తున్నారు.

విశాఖ తూర్పు..
విశాఖ తూర్పు సీటు టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇక్కడ గత రెండుసార్లుగా వెలగపూడి రామక్రిష్ణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్ధి విజయనిర్మల ధీటైన పోటీ ఇస్తున్నారు. ఇక్కడ వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

విశాఖ ఉత్తరం..
ఈ నియోజకవర్గం భిన్న వర్గాల సమ్మేళనం.. ఇక్కడ మెట్రో సిటీ వాతావరణం ఉంటుంది. కులాలకంటే డెవలప్మెంట్ మీదే ఇక్కడి ప్రజల ఆలోచనలు ఉంటాయి. టీడీపీ తరఫున గంటా, వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బరిలోకి దిగుతున్నారు. అయితే వైసీపీ, బీజేపీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ గత ఇరవయ్యేళ్లుగా టీడీపీ ఇక్కడ గెలవలేదు. దీనికితోడు ప్రతీ ఎన్నికకూ సీటు, పార్టీ మార్చే గంటా ఈసారి గెలిచే అవకాశం లేదంటున్నారు. అలాగే తనదైన రాజకీయ వ్యూహాలతో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గెలవాలనుకుంటున్నారు. ఆయన కూడా అయిదేళ్ళ పాటు అవినీతి మరక లేకుండా బలమైన నేతగా ఇక్కడ ఉన్నారు. తాజాగా బీజేపీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంతో రాజుగారికి కలసివస్తుందంటున్నారు. అభివృధ్ధి పనులను కూడా ఆయన చేసి చూపించడం, ఎమ్మెల్యేగా మంచి మార్కులు రావడంతో ఆయన వైసీపీ గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. అలాగే కేకే రాజుకు వ్యక్తిగతంగా కొంత పలుకుబడి, పార్టీ క్రేజ్ తో పాటు, రైల్వేజోన్ కోసం వైసీపీ పోరాడిన అంశం కలిసొచ్చి వైసీపీ గాలి ఇలాగే వీస్తే కేకేరాజుకు ఆయనకు ఎదురులేదంటున్నారు.

విశాఖ సౌత్..
ఈ సీటు ఇపుడు చర్చగా ఉంది. దక్షిణం సీటు పూర్వ రూపం విశాఖ వన్ నుంచి 2004 ఎన్నికల్లో సీనియర్ నేత ద్రోణం రాజు సత్యనారాయణ గెలిచారు. అప్పట్లో పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి మంచి ఊపుతో కాంగ్రెస్ పార్టీకి తీసుకువచ్చారు. అప్పుడు సీనియర్లు చాలామంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.. వారిలో ద్రోణంరాజు కూడా ఒకరు.. అలాగే మళ్ళీ పదిహేనేళ్ల తరువాత ద్రోణం రాజు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. పాదయాత్ర చేసిన నాటినుంచి పార్టీకి అనుకూల వాతారవణం ఉంది. దాంతో శ్రీనివాస్ గెలుస్తారన్న సెంటిమెంట్ బలపడిపోయింది. అలాగే అక్కడ జగన్ ఆద్వర్యంలో వైసీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా నమ్ముతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా గత ఎన్నికల్లో పార్టీ ఊపు మీద గెలిచిన వ్యక్తి కావడంతో ఆయన గెలుపుమీద పెద్దగా హోప్స్ లేవు.

విశాఖ వెస్ట్‌..
విశాఖ వెస్ట్‌ ఇక్కడినుంచి ప్రముఖ నిర్మాత వైసీపీ విజయ ప్రసాద్ మళ్ల బరిలోకి దిగుతున్నారు. వైసీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్ధి జీవీఆర్ నాయుడు బలంగా ఢీకొంటుండగా ఇక్కడ హోరాహోరీ పోటీ కనిపించే అవకాశం ఉంది.

గాజువాక..
గాజువాక రాజకీయ ముఖచిత్రం పవన్ పోటీతో ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉండగా.. పవన్‌ కల్యాణ్‌ గాజువాకలో పోటీకి తెరతీశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డినే మళ్లీ పోటీకి దింపారు జగన్.. బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్దనరావు పోటీ చేస్తున్నారు. గాజువాకలో బలమైన సామాజిక వర్గంతో పాటు సభ్యత్వ నమోదులో సుమారు 70 వేలు ఉండడంతో గెలుపు సునాయాసమని లెక్కలు వేసి పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ నిలబడుతున్నారు. పైగా మెగాస్టార్‌ చిరు, పవన్, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్లు బలంగా ఉన్నాయి. ఇవన్నీ అనుకూలిస్తాయనేది జనసేన అంచనా.. ఇక వైసీపీ తరపున తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. 8ఏళ్లుగా నాగిరెడ్డి పార్టీని గాజువాకలో బతికించడంతోపాటు.. పెదగంట్యాడ కార్యాలయంలో వీఏఓగా, వీఆర్‌ఏ సంఘం రాష్ట్ర నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. పెదగంట్యాడలో తమ సామాజిక వర్గం ఓట్లు తమకే పడతాయని ఆయన ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో మూడు విడతలుగా గడపగడపకు వైసీపీ పేరుతో ఆయన పాదయాత్రలు పూర్తి చేయడం కలిసొస్తుందని వైసీపీ లెక్కలు వేస్తుంది.

చోడవరం..
విశాఖ జిల్లాలో చోడవరం నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు సొంతపార్టీ నేతల నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది. ఇక వైసీపీ నుంచి 2004లో మాడుగుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కరణం ధర్మశ్రీ విజయం సాధించారు. తరువాత 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ తరపున చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ధర్మశ్రీ పోటీ చేసారు. ఈ రెండు ఎన్నికల్లో ధర్మశ్రీపై కేఎస్ఎన్ఎస్ రాజు విజయం సాధించారు. ఓటమిపాలైనా నియోజకవర్గంలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి కలిసి వస్తుందన్న నమ్మకంలో ధర్మశ్రీ ఉన్నారు. వైసీపీ కేడర్ కూడా గతంలో కంటే చోడవరంలో మరింత పటిష్టo కావడంతో గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరికీ హోరాహోరీ పోటీ నెలకొంది. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్ మేనియా పనిచేస్తుందని కొందరు భావిస్తున్నారు.

మాడుగుల..
జిల్లాలో మైదానప్రాంతానికి, ఏజెన్సీకి ముఖద్వారంగా నిలిచింది మాడుగుల నియోజకవర్గం.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎక్కువసార్లు విజయం సాధించగా.. అయితే 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కరణం ధర్మశ్రీ విజయంతో టీడీపీ విజయాలకు బ్రేక్‌ పడింది. పూర్తిగా వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఎక్కువశాతం ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి వివిధ పార్టీల నుంచి టిక్కెట్‌కు పోటీపడుతున్నవారంతా ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలే.. 2004లో విజయం సాధించిన ధర్మశ్రీ 2009లో చోడవరం నుంచి రంగంలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాడుగుల నుంచి పోటీచేసి అవుగడ్డ రామునాయుడుపై టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు విజయం సాధించారు. అయితే 2014లో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యానాయుడు చేతి లో గవిరెడ్డి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మాడుగుల కోట వైసీపీ అధీనంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలుస్తుందని స్థానికులు చెప్తున్నారు.

అరకు..
వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలోకి ఫిరాయించి, గ్రనైట్ తవ్వకాలకు సహకరించి మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. ఇప్పుడు ఆ టికెట్ లో ఆయన కొడుకు, మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున శెట్టి ఫాల్గుణ బరిలోకి దిగుతున్నారు. ఎస్‌బిఐ బ్రాంచి మేనేజర్‌ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆయన గిరిజనుల హక్కులకోసం పోరాడుతూ ముందుకు కదులుతున్నారు. గిరిజనుల్లో ఇప్పటికీ వైఎస్సార్ ను దేవుడిగా కొలుస్తుండడం, కిడారి శ్రవణ్ తండ్రి ఫిరాయించడం మంత్రిగా శ్రవణ్ నియోజకవర్గానికి ఏమీ చేయకపోవడంతో ఫాల్గుణ భారీ మెజార్టీతో గెలుస్తాడట.

పాడేరు..
పాడేరులో ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య పోరు న‌డ‌వ‌నుంది. టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వ‌రి, వైసీపీ నుంచి భాగ్యల‌క్ష్మీ పోటీలో ఉన్నారు. వీరిద్ద‌రూ ఎస్టీలోని బ‌గ‌తు వ‌ర్గానికి చెందిన వారే.. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక భాగ్యల‌క్ష్మీ గతంలో కాంగ్రెస్‌లో కొన‌సాగగా మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్ర‌దేవ్ వ‌ర్గంలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగారు. గిరిజనుల్లో ఇప్పటికీ వైఎస్సార్ ను దేవుడిగా కొలుస్తుండడం, గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించడంతోపాటు జగన్ కు భారీసంఖ్యలో అభిమానులుండడంతో భాగ్యలక్ష్మి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుస్తోంది.

అనకాపల్లి..
అనకాపల్లి వైసీపీనుంచి యువ నాయకుడు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గుడివాడ అమరనాథ్‌, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్, జనసేన కూటమి నుంచి పరుచూరి భాస్కరరావు బరిలోకి దిగుతున్నారు. జనసేన ఇక్కడ ఆశించిన ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ పై విపరీతమైన అవినీతి, కబ్జా ఆరోపణలున్నాయి. అమర్నాధ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, యువ నాయకుడిగా మంచి పేరు, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ప్రత్యేకహోదా కోసం పోరాడిన వ్యక్తిగా, విశాఖ రైల్వేజోన్ కోసం నిరాహార దీక్ష చేయడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతతో అమర్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాయకరావు పేట..
వైసీపీకి పాయకరావుపేటలో మంచి పట్టు ఉంది. 2012 ఉపఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గొల్ల బాబూరావు బంపర్ మెజారిటీతో గెలిచారు. 2014లో తిరిగి ఆయనకే టికెట్ ఇస్తే గెలిచేవారు కానీ అమలాపురం ఎంపీగా పంపడంతో అక్కడా, ఇక్కడా కూడా వైసీపీ పరాజయం పాలు అయింది. ఇపుడు మళ్ళీ పాయకరావుపేటను కేంద్రంగా చేసుకుని బాబూరావు పార్టీ కోసం పనిచేస్తున్నారు. టీడీపీ తరపున డాక్టర్ బంగారయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత పట్ల ప్రజావ్యతిరేకత ఉండడంతో ఆమెను ఓడిపోతుందనే భయంతో ఆమెను మార్చారు. బాబూరావుకు అట్టడుగు వర్గాలలో కూడా మంచి పేరుంది. టీడీపీలో లేని సమన్వయం తమ పార్టీలో ఉందని, టీడీపీలోని గ్రూపు రాజకీయాలు తమ పార్టీలో ఉన్నాయని అవే తమను గెలిపిస్తుందని వైసీపీ ధీమాగా ఉందిక్కడ

నర్సీపట్నం..
నర్సీపట్నం విశాఖ గ్రామీణ జిల్లాలో రాజకీయ ప్రాధాన్యజ గల ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ గెలిస్తే రాష్ట్ర స్థాయిలో కీలక నేతలుగా గుర్తింపు పొందుతున్నారు. అనేక పర్యాయాలు మంత్రి పదవులు చేపట్టిన ఘనత నర్సీపట్నం ఎమ్మెల్యేలకే దక్కింది. నియోజకవర్గంలో 80 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లే ఉన్నారు. ఇక్కడ ఒకప్పుడు తంగేడు రాజుల ఆధిపత్యం ఉండగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక వెలమల ఆధిపత్యం కొనసాగుతుంది. జనాభాలో అత్యధికంగా వెలమలు ఉండగా, ద్వితీయ స్థానంలో కాపులు ఉన్నారు. దీంతో దీన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వ్‌ చేశాయి. అయితే అయ్యన్నకు గంజాయి వ్యాపారాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు, భూకబ్జాలకు పాల్పడారనే వాదనలున్నాయి. వైసీపీ తరపున దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు ఉమా శంకర్‌ గణేష్‌ వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున పూరి జగన్నాథ్‌ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌమ్యుడిగా ఉమా శంకర్ కు మంచిపేరుండంతో పాటు అయ్యన్నపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన అవినీతి ఆరోపణలకు తోడు విశాఖలో టీడీపీ నేతలు భారీగా పాల్పడ్డ భూ కబ్జాలు, కుల రాజకీయాలతో ప్రజలు విసుగెత్తారు. జగన్ పార్టీ వేవ్ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన ఓటర్లు వైసీపీకి భారీగా పట్టం కట్టనున్నారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో వైసీపీ 7చోట్ల భారీ మెజార్టీ వచ్చే అవకాశముంది.. టీడీపీకి 4సీట్లు, జనసేన 1 గెలవగా మిగతా మూడు స్థానాల్లోని హోరాహోరీ పోరులో బీజేపీ లేదా జనసేన లేదా టీడీపీ ఒకస్థానం వైసీసీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat