ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొరపాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగలవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇసుకలారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా లక్షరూపాయలకు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు.
ఇక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట వాణి, కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా వంగా గీతలను ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.ఈ ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో సుమారు 6000 పాఠశాలలు మూతపడ్డాయని ఈసారి బాబుకు ఓటు వేస్తె ఒక్క పాఠశాల కూడా ఉండదని అన్నారు.ప్రస్తుతం నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలన్నా రూ.25 వేలు అవ్తుంది.అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు మండిపడ్డారు.