గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించినట్లు ఒక వార్త పత్రిక కథనం ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమచారం.
ఓటుకు రూ.12 వేలు!
తెలుగుదేశంపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటుకు రూ.12 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులే ఆయా ప్రాంతాల్లో చెబుతుండటం గమనార్హం. లక్ష మంది ఓటర్లకు రూ.12 వేలు చొప్పున, మరో లక్ష మందికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఇంకా పెంచాలని ఆలోచన చేస్తున్నారు. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న తాడేపల్లి మండలంలో డబ్బు పంపిణీ ఎక్కువగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక, నూతక్కి, చిర్రావూరు, పాతూరు వంటి పలు గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా, నిఘా తప్పించుకునేందుకు.. ఆయా గ్రామాలకు పోలీసు వాహనాల్లో డబ్బు పంపేందుకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా బందోబస్తు వాహనాల్లో తమకు అనుకూలమైన వారిని గతంలోనే నియమించారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఐటీ కంపెనీల నుంచి పోలీసు జీపుల్లోనే భారీగా డబ్బును నియోజకవర్గంలో డంప్ చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏదిఏమైనా లోకేశ్ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags 2019-elections andrapradesh tdp vote for note