ప్రజలకోసం నిత్యం ఆలోచించే వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. పాదయాత్రలో ప్రతి వ్యక్తి బాధ వైయస్ జగన్ తెలుసుకున్నారని, ప్రజలకు ఏదో చేయాలన్న తపన జగన్‌లో ఉందన్నారు. ప్రజలను సొంత కుటుంబంలా వైయస్ జగన్ భావిస్తారని, ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జగనేనన్నారు. జగన్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారని, జగన్ వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయనపై ఎన్ని కుట్రలు చేసిన ప్రజలకోసం బాధ్యతగా, ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తి వైయస్ జగనేనన్నారు. ఏం చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయో వైయస్ జగన్ ప్రతిక్షణం ఆలోచన చేస్తున్నారన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రజల కోసమే చేశారన్నారు. విద్య,ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నారన్నారని ఆయనన్నారు.
