Home / 18+ / తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌నేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 ఎమ్మెల్యే ఉన్నారు. కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేసే జ‌న‌సేన ప్ర‌భావాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఫ‌లితాల్లో పెనుమార్పులు రావచ్చు.. గత ఎన్నిక‌ల్లో టీడీపీ జనసేనలు కలిసి బరిలోకి వచ్చాయి కాబట్టి ఈ రెండు పార్టలను ప్ర‌త్యేకంగా కాకుండా భాగ‌స్వామిగా చూసినా ఫలితాలు తారుమారవుతున్నాయి. మండ‌పేట‌, రామ‌చంద్రాపురంలో టీడీపీ జనసేనల ప్రభావం ఉంది.

రాజ‌మ‌హేంద్‌మవ‌రం సిటీలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.ఇక వైసీపీకి తుని, రంప‌చోడ‌వ‌రం సిట్టింగ్ సీట్ల‌తో పాటు పిఠాపురం, ప్ర‌త్తిపాడు, కాకినాడ రూర‌ల్, రాజోలు, రాజాన‌గ‌రం, అమ‌లాపురం, కొత్త‌పేట‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ అన‌ప‌ర్తిలో బలమైన గాలి వీస్తోంది. బ‌ల‌మైన నాయ‌కులు ఉండ‌డం, సామాజిక స‌మీక‌ర‌ణాలు వైసీపీకి క‌లిసొస్తున్నాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్య‌తిరేక‌త బ‌లంగా ఉండ‌డం వైసీపీకి అనుకూలంగా మారుతోంది. జ‌గ్గంపేట‌, పెద్దాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివ‌రం, పి గ‌న్న‌వ‌రం, నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరా హోరీ పోరు కనిపించేలా ఉంది. త‌ప్పేలా లేదు. టీడీపీలో అనైక్య‌త‌, నాయ‌క‌త్వ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇక జ‌గ్గంపేట‌, అమ‌లాపురం, పెద్దాపురం, రాజాన‌గ‌రం, కాకినాడ సిటీలో ప్రభుత్వ వైఫ‌ల్యం వైసీపీకి కొంత అనుకూల‌త‌ కనిపిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.. గతంలో వైఎస్ హయాంలో కూడా చంద్రబాబు టెన్షన్ పడలేదు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అనేక సర్వేల ఫలితాలు టీడీపీకీ వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో చంద్రబాబు ఈ జిల్లాపై మరింత శ్రద్ధ కనబరిచారు. ఏపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు ముఖ్యమైనవి. కానీ తూర్పుగోదావరి జల్లాలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోంది. ఇందుకు కారణం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. అక్కడి నేతలపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కొందరు ఆర్థిక లావాదేవీలే కాకుండా సెటిల్ మెంట్లు చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలోని 16 మందిలో 9మంది టీడీపీ ఎమ్మెల్యేలనై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి కట్టలు తెంచుకుందన్న సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat