విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ఈరోజు వేకువజామున విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ వాకింగ్ చేశారు.. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటూ కూడా తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా లయోలా కాలేజికి ఆయన వెళ్లారు. పీవీపీ వాకింగ్ రావడంతో మిత్రులు, మరికొందరు వాకర్స్ ఆయన్ని పలకరించారు. కొద్దిసేపు వాకింగ్ చేస్తూనే పీవీవీ వారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న బాస్కేట్ బాల్ కోర్టుకు వెళ్లి ఆ యువకులతో కలిసిపోయి ఆడారు… వాకర్స్ తో మాట్లాడినప్పుడు అదేవిధంగా యూత్ తో ఇంట్రాక్టు అయినప్పుడు ఆయన దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. వాటన్నింటీని దృష్టిలో ఉంచుకుంటానని పీవీపీ గారు వారికి హామీ ఇచ్చారు. అలాగే తాజాగా షర్మిళను కలిసి తన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అభ్యర్ధించారు.
