ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదన్నారు. బాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని షర్మిళ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని షర్మిల ఈ గుర్తుచేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు.
రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసంచేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడి తొలి సంతకానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. నేను వైఎస్సార్ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నానన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పాలన సాగించారు. మహానేత వైఎస్సాఆర్ హయాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేదని. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంటకు గిట్టుబాటు ధర ఉండేదన్నారు. ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగా చదువుకునేలా పూర్తి రీయింబర్స్‌మెంట్ ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్ ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడని కొనియాడారు షర్మిళ.