వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతుగా ఆయన సతీమణి వైయస్ భారతి ప్రచార బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. తాజాగా వైయస్ భారతి రంగంలోకి దిగారు. వైయస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ కాలి నడకన ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశఆరు. తమ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆమె చెప్పారు. ప్రచారంలో భారతితో పాటు వైయస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. వైయస్ భారతి ప్రధాన కడప జిల్లాపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. వైయస్ విజయమ్మ, షర్మిల కూడా కడప జిల్లాలో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. భర్త కష్టంలో పాలుపంచుకుంటున్న భారతమ్మను పులివెందుల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సీతవంటి భార్య దొరికిందని అభినందిస్తున్నారు. అసలు మీరు ప్రచారానికి రావొద్దు మీకే ఓటేస్తాం అని చెప్తున్నా జగన్ గారికి మీరు ఓటేస్తారని తెలుసమ్మా కానీ అహంకారానికి పోయి అడగకుండా ఉండకూడదు.. మా బాధ్యతగా మిమ్మల్ని అడుగుతున్నా అని భారతమ్మ ఓటర్లతో చెప్తున్నారు.
