నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్ 11న ఎన్నికల పోలింగ్ అయితే 9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్ మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఇది విన్న జనాలు పడిపడి నవ్వుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్ ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే పసుపు-కుంకమ పై జనాలు నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ ‘అక్కా.. పసుపు-కుంకుమ మొదట విడత కింద 10 వేల రూపాయలు వచ్చాయా?’ అని పేద్ద బిల్డప్ ఇస్తూ అడగడంతో అక్కడున్న మహిళలు రాలేదు.. మాకు రాలేదు.. అన్నారు. దీంతో కంగుతిన్న లోకేష్ తెల్లమొహం వేశారు. ఆ అక్కకు వచ్చాయంట అంటూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మంత్రి అయ్యాక మారాడుకున్నామని పప్పు పప్పేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’ గ్రామాల్లో తాగునీరు లేకుండా చేస్తానని లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే.
