బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ హీరో తనీష్ వైసీపీ తరపున ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చున్న తనీష్ వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ని కలిసి పార్టీలో చేరారు తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీలో కష్టపడి పనిచేస్తానని జగన్‌ని సీఎం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒకవైపు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూనే పొలిటికల్‌గా బిజీ అవుతున్నారు తనీష్. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌గా కంటెస్టెంట్ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ యాక్టివ్ అవుతూ వైసీపీలో చేరి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నటుడు అలీతో కలిసి కర్నూలు జిల్లాలో జగన్ కు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రేమంటే ఇదేరా, మన్మథుడు, దేవుళ్లు తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించిన తనీష్ నచ్చావులే, రైడ్ చిత్రాల్లో హీరోగా నటించారు. బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోలో ఫైనల్ కంటెస్టెంట్ కౌశల్‌కి గట్టిపోటీ ఇచ్చారు. షో విన్నర్ కౌశల్‌తో సై అంటే సై అనేవాడు. ఫైనల్ వరకూ ఈ ఇద్దరి మధ్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. తిట్టుకుంటూ కొట్టుకుంటూనే షోని రక్తికట్టించారు.. తర్వాత కూడా కౌశల్, తనీష్‌ల మధ్య వివాదం కంటిన్యూ అయ్యింది. ఇటీవల కౌశల్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకు ముందే తనీస్ వైసీపీలో చేరారు. అయితే తనీష్ మాత్రం తన స్పీచ్ లు ఇరగదీస్తున్నాడు బాల నటుడిగా అలరించిన తనీష్ హీరోగా సక్సెస్ అయ్యారు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.