తెలంగాణలో కలకలం సృష్టించాలని, ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేయాలని భావించిన భారతీయ జనతాపార్టీకి ఊహించని షాక్ తగిలింది. బజీఏపీ వేసిన గోల్ప్ బూమరాంగ్ అయింది. సెల్ఫ్గోల్గా మారింది. ఎంపీ కవితను టార్గెట్ చేయగా….అది ప్రధాని మోదీకి రివర్స్ అయింది.
ఎర్రజొన్నల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు అన్నదాతలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వారితో పార్లమెంటు పోరులో నామినేషన్లు వేయించారు. ఈదీనిపై ఇటీవల ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమకు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉందని…ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వారంటేనే అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇదే ఎపిసోడ్ ఆధారంగా ఊహించని షాక్ ఎదురైంది. తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో రోజులు ప్రదర్శనలు చేసిన తమిళనాడు రైతులు ఎన్నికల సమరంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్లు వారణాసి లోక్ సభ సీటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు 111 నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్రానికి చెందిన 111 మంది రైతులు వారణాసిలో మోడీపై పోటీ చేయనున్నట్టు తమిళనాడు రైతు నేత పీ అయ్యాకణ్ణు శనివారం ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరతో సహా రైతుల ఇతర డిమాండ్లను పూర్తి చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చేందుకు తాము ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడైన అయ్యాకణ్ణు చెప్పారు.