రాజకీయాల్లో ఆయా పార్టీల గురించి కొందరు నేతలు సరదాగా వ్యాఖ్యలు చేసే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజాశాంతి పారట్ఈ గురించి పలువురు ఇదే అంశాలను చర్చించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి గురించి ఇదే మాటలు చర్చించుకుంటున్నారని చర్చ జరుగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తున్నా తేల్చుకోలేకపోతోంది.
తొలుత 4 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్.. ఆ స్థానాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే తాము పోటీ చేయా లనుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ వంటి స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్న రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోదండరాంను కోరారు. ఇక బుధవారం మరో నేత మధుయాష్కీ కూడా కోదండరాంను కలిసి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం అవసరమా? అని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీకి అభ్యర్థులు లేకపోవడం వల్ల కూడా పోఈ చేయడం గురించి ఆలోచిచండం లేదంటున్నారు.