కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు పార్టీ ఎంపీ అభ్యర్ధిగా ఎంపికచేసింది. అయితే ఇదంతా యాధృచ్చికంగానో రాత్రికి రాత్రే జరిగిపోలేదు..
తలసాని శ్రీనివాస్ సీనియర్ రాజకీయ నాయకునిగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తండ్రి సంపాదించిన ఆస్తిని, తండ్రి పదవులను అడ్డు పెట్టుకుని వ్యవహారాలు చేస్తున్న ఈ రోజుల్లో సాయికిరణ్ తండ్రివద్దకు సహాయం కోసం వచ్చేవారిని గుర్తించారు. తమ ఇంటికి ఆపద అంటూ వచ్చినవారి కంటనీరు తుడిచి పంపాడు.. రాజకీయంగా తండ్రికి గత రెండు ఎన్నికల్లోనూ వెన్నుదన్నుగా నిలిచి తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించారు. పార్టీకోసం అహర్నిశలు శ్రమించారు. సనత్ నగర్ అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు.. తండ్రి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో తాను నియోజకవర్గ సమస్యలు తీర్చే నాయకుడు అయ్యాడు. సాయికిరణ్ వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం సాయికిరణ్ కు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు.
సాయికిరణ్ అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సికింద్రాబాద్ పార్లమెంట్ ను గెలిచి పార్టీ అధినేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బహుమతి ఇస్తానని, గెలిచిన తర్వాత సికింద్రాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టించి పనిచేస్తానని చెప్తున్నారు. యువకుడు దశాబ్ధకాలంగా తండ్రితోపాటు రాజకీయాల్లో ఉంటున్న అనుభవంతోపాటు నిబద్ధత, అందరినీ ఆదరించే గుణం ఉండడంతో సికింద్రాబాద్ అభివృద్ధికై తరలివచ్చిన తలసాని వారసుడిని ప్రజలు, యువత బ్రహ్మరధం పట్టేందుకు సిద్ధమవుతున్నారు.