వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నామినేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పులివెందులలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా సాగింది. వేలమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్ సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అలాగే మసీద్‌లో దువా చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి వైయస్ జగన్ నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైయస్ జగన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే పలాస వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సీదరి అప్పలరాజు, ఇచ్చాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పిరియా సాయిరాజ్, పాతపట్నం అభ్యర్థిగా రెడ్డిశాంతి, కురుపాం అభ్యర్థివగా పుష్పశ్రీవాణి, వైయస్‌ఆర్ జిల్లా కడప అభ్యర్థిగా షేక్ అంజాద్ బాషా, కైకలూరు అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ, హిందూపురం అసెంబ్లీఅభ్యర్థిగా రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి, ఉండి వైసీపీ అభ్యర్ధిగా పీవీఎల్ నరసింహరాజు, శింగనమల అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి, పెడన అభ్యర్థిగా జోగి రమేష్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఇవాళే నామినేషన్లు వేసారు.
వైసీపీ అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమాలకు, ర్యాలీలకు పెద్దఎత్తున అభిమానులు కార్యకర్తలు హాజరవుతున్నారు. ఒక ఉప్పెనలా జనం తరలివస్తుండడంతో పార్టీ అభ్యర్ధులే తమకు పలుకుతున్న మద్దతును చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రజా ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను విశ్లేషిస్తే ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా నిలబడడం స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల్లో తలపడిన వైసీపీ టీడీపీలు రెండూ అధికారంలో లేవు కాబట్టి గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాలేకపోయిందని అతి తక్కువ ఓట్ల తేడాతో జగన్ ఓటమి పాలయ్యారని, ఈ ఎన్నికల్లో అత్యంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ లో చంద్రబాబు నాయుడు కొట్టుకుపోవటం ఖాయమని వైసీపీకి స్పష్టమైన మెజారీటీ వస్తుందని చెప్తున్నారు. తమ పార్టీ కచ్చితంగా 130 పైచిలుకు స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్తున్నారు.
