కొద్దిరోజులుగా కర్నూలు జిల్లాలో ఎండలతో పాటుగా ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. ఆధిపత్య పోరుతో ఈ వివాదం ముదిరింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అయితే , అప్పటివరకు భూమాకు అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవాలని ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటినుంచి మళ్లీ విభేదాలు, వర్గపోరు తారాస్థాయికి చేరుతూనే ఉంది. ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాల్లో భూమా బ్రహ్మానందరెడ్డి పాగా వేసి ఏవీ సుబ్బారెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా టార్గెట్ చేసారు. ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డి తమతో టీడీపీలో ఉంటూ మాకే వెన్నుపోటు పొడుస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసిందట.. అయితే,నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఏవీ సుబ్బారెడ్డికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ పదవి ఇవ్వలేదని దానిని మంత్రి అఖిలప్రియ అడ్డుకుంటున్నారనేది ఏవీ అనుచరుల వాదన.. ఏవీ ఆధిపత్యం పెరిగితే ఆయన పోటీకి వస్తారని కుట్రతో చంద్రబాబు సలహాలతో జిల్లా టీడీపీ న్యాయకత్వం ఏవీ సుబ్బారెడ్డిని అణచివేసారంటూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏవీ సుబ్బారెడ్డి వైసీపీ తరపున పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారని,అందుకే ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నారని ఆళ్లగడ్డ టికెట్ ఎలాగు టీడీపీ నుంచి రాదు కాబట్టి, ఆయన వైసీపీలో చేరాలనుకున్నారట.. ఏవీ వర్గం కూడా తక్కువేమీ ఉండదు కాబట్టి జిల్లాలో టీడీపీకి వచ్చే ఒకటి రెండు సీట్లు కూడా రానివ్వకూడదని చేరికలు వస్తే చేర్చుకోవాలని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారట.. ఇందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి సానుకూలంగా ఆహ్వానం అందిన వెంటనే ఆయన ఫ్యాన్ పట్టుకుంటాడని చెప్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు శిల్పా బ్రదర్స్ సంప్రదింపులు చేస్తున్నారని అఖిలప్రియను, భూమా బ్రహ్మానందరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఏవీని దింపుతున్నారని సమాచారం. మొత్తానికి అఖిలప్రియ వర్గం, ఏవీ వర్గం రెండుగా చీలకుండా ఎన్నికలో ఏవీ సహకరించడం కూడా టీడీపీ గెలుపునకు ఎంతో అవసరం.. కానీ వీరిద్దరు విడిపోతే పార్టీ క్యాడర్ కూడా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని ఎన్నికలకు మరెంతో సమయం లేకపోవడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.