ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏ సమయంలో ఏ అభ్యర్థి ఏ పార్టీలోకి మారుతారో అని బాబు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ తరుపున పోటీ చేయనని ప్రకటించారు.
అయితే ఈ సంగతి మరువకముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు అభ్యర్థి పూర్ణం పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని ప్రకటించినట్టు సమాచారం.అయితే ఈ విషయం ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తునట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే లలిత కుమారిని పూతలపట్టు అభ్యర్థిగా ప్రకించే అవకాశం ఉందని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నారు.కాగా మరికొన్ని రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో పూర్ణం కనిపించకుండా పోవడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురైయ్యారు.