తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో నామా భేటీ అయి.. టీఆర్‌ఎస్‌లోచేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.కాగా ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.