నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్యకర్తలు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీలు నిర్వహించారు. అనిల్ కుమార్ తన వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అనుకున్నముహూర్తానికి సమయం దగ్గర పడటంతో ఆయన కార్యకర్త బైక్ పై కార్పోరేషన్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, ముక్కాల ద్వారకానాద్, వైసీపీ కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు