విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్, 6వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. తూర్పు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొప్పాన భవకుమార్ తో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. పడవలరేవు నుంచి మాచవరం డౌన్, మారుతి నగర్, నిమ్మతోట మీదుగా మెట్రో వరకు ప్రచారం సాగింది. ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి వీపీవీ తనదైన శైలిలో ఆటోలను ఆపి వారిని ఓట్లు ఆర్జించి, ఆటో డ్రైవ్ చేసి వారిని ఉత్సహ పరిచారు. మరోవైపు ఆర్టీసీ సిటీ బుస్సులోకి ఎక్కి ప్రయాణికులను పలకరించి తనకు తానే పరిచయం చేసుకుని ఫ్యాన్ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరిన తీరు అందరని ఆశ్చర్యచికుతాలను చేసింది. తన ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి అవ్వాలను పెద్దవాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక చిన్న పిల్లలు, యువకులకు సెల్ఫీలు ఇచ్చి వారిని ఉత్సహ పరుస్తున్నారు… పీవీపీ వెంట పెద్ద ఎత్తున యువకులు నినాదాలు చేటున్నారు.
