ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. తాజాగా సీఎం చంద్రబాబు కూడా సభల్లో మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు చేయలేదని చెప్పారు. జనం లేని సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రి సిద్దా రాఘవరావు కూడా తాజాగా మాట్లాడుతూ పార్టీ మ.. కుడిసిపోతుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అలాగే లోకేశ్ అయితే మంగళగిరిలో ఏమూలకు వెళ్లినా అసహనం వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా వివేకా చనిపోతే తాను పరవశించిపోయానంటూ వ్యాఖ్యానించారు. ఇక రౌడీ ఎమ్మెల్యేగా పేరుగాంచిన చింతమనేని పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు దళితులను ముండా కొడుకులుగా అభివర్ణిస్తూ మాట్లాడారు. అదే కాకుండా తాను సహజంగా మాట్లాడే అన్ పార్లమెంటరీ భాషతో చెలరేగుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ అభ్యర్ధులు ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు వైసీపీలో చేరిపోయారు. ఇంకొందరు మాత్రం ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలా ప్రచారానికి వెళ్లిన కొందరు మాత్రం ఓడిపోతాం అనే భయంతో ప్రజలముందే తాము ప్రజాప్రతినిధులమనే కనీస సోయి కూడా లేకుండా పిచ్చివాగుడు వాగుతున్నారు. దీనంతటికీ కారణం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కనీసం 130 స్థానాల్లో గెలుస్తుందనే సంకేతాలు వెలువడడంతో టీడీపీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అర్ధమవుతోంది.
