పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్న అంచనాతో పవన్ పోటీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంపరిధిలో పార్టీకి కలిసొస్తుందని నాగబాబు బరిలో ఉంటే నరసాపురం లోక్‌సభ సీటును కూడా గెలవచ్చనే ప్లాన్‌తోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందనేది జనసేన నాయకుల వాదన.. అయితే ప్రస్తుతం నర్సాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచీ వేటుకూరి వెంకటశివరామరాజు గతంలో ఉండి ఎమ్మెల్యే దిగగా.. ఇతనిని కావాలనే డమ్మీ అభ్యర్ధిగా టీడీపీ నిలబెట్టిందనే వార్తలొస్తున్నాయి. అలాగే వైసీపీ నుంచీ ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే కసితో పోటీ చేస్తున్నారు. పోటీ రఘురాజు, నాగబాబుల మధ్యే ఉంటుందనేది వాస్తవం.. కాగా, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. జనసేనకు బలంగా భావించే కాపు ఓట్లు ఎక్కువగా వున్న వెస్ట్ గోదావరి నుంచే నాగబాబు పోటీచేయడం విశేషం. ఈ జిల్లా గత ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసింది.. ఈసారి మాత్రం వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుదన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేఫథ్యంలో తెలుగుదేశంతో లోపాయకారీ సంబంధాలు వున్న జనసేన పశ్చిమమీద ఎక్కువగా దృష్టిపెట్టడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే గతంలో పశ్చిమ అభ్యర్ధులను ఎంపిక చేసినపుడు నరసాపురం ఎంపీ స్థానాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. అప్పటికే రఘురాజు ఎంతో కీలకంగా ఉన్నా, ఆర్ధికంగా బలంగా ఉన్నా సామాజికవర్గ పరంగా ఎంతో బలవంతుడైనా కూడా చంద్రబాబు ఆ సీటును రఘురాజుకు కేటాయించలేదు. హోల్డ్ లో ఉంచి అవమానించడం పట్ల రఘురాజు తన సొంత పార్టీ వైసీపీలోచేరిపోయారు. కానీ అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదు.. అయినా ఆ స్థానానికి మరింత బలమైన అభ్యర్ధులు పలువురు ఉన్నా చంద్రబాబు మాత్రం ఎక్కడో ఉండి ఎమ్మెల్యేని ఏమాత్రం గెలిచే అవకాశం లేని శివరామరాజుకు ఈ సీటు ఇచ్చారు. ఇక్కడే చాలామందికి అనుమానాలు మొదలయ్యాయి.. అయితే శివను ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించిన కొద్దిరోజులకే నాగబాబు అనూహ్యంగా ఎంపీగా దిగుతుండడం పట్ల జనసేన టీడీపీ లోపాయకారీ ఒప్పందం గోదావరి జిల్లాల్లో అదరికీ అర్ధమయ్యింది. కావాలని రఘురాజును తప్పించి శివకు ఇస్తూ టీడీపీ జనసేన చేసిన చీకటి రాజకీయం బయటపడింది. గత ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగిన టీడీపీ సేనలు ఇప్పుడు విడివిడిగా పోటీచేసి కలిసిపోనున్నాయని అందరికీ అర్ధమవుతోంది. మరోవైపు మొన్నటివరకూ పవన్ టీడీపీని విమర్శించినట్టు నటించడంతో పవన్ అభిమానులు టీడీపీని తమ వైరుధ్య పార్టీగా భావించారు. కానీ ఇప్పుడు ముసుగులు తొలగుతుండడో జనశ్రేణులు మాత్రం కచ్చితంగా తమ నాయకుడు తమను మోసం చేసాడనే భావనతో ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మాత్రం టీడీపీ సేనల కుమ్మక్కు రాజకీయాలను పసిగడితే నాగబాబు కూడా 2009లో చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీనుంచి ఓడిపోయినట్టు నాగబాబు కూడా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం అనేది నరసాపురం వైసీపీ నాయకుల వాదన.