సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారా డాన్స్ కు ఫిదా అయ్యారు. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ సాంగ్ కు సితార స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తన కూతురు స్టెప్పులకు ఆనందంలో మునిగిపోయిన మహేష్.. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “వాట్ ఎ టాలెంట్” అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు. దీంతో సితారా డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
